మారుతి తొలి ఇథనాల్ కారు.. వ్యాగన్ఆర్ మాడల్‌ను ఆవిష్కరించిన సంస్థ
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..తన తొలి ఇథనాల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారైన వ్యాగన్ఆర్ మాడల్‌ను పరిచయం చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 4: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..తన తొలి ఇథనాల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారైన వ్యాగన్ఆర్ మాడల్‌ను పరిచయం చేసింది. ఇథనాల్-బ్లెండెడ్ ఫ్యూయల్‌తో నడిచే ఈ కారుతో సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈ నయా వ్యాగన్ఆర్ మాడల్ 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్‌తో నడువనున్నదని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి తకేచి తెలిపారు.. ఈ కారు ధర ప్రస్తుతం సంస్థ వెల్లడించకపోయినప్పటికీ, రూ.8 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.
2024లో న్యూఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఈ కారును ప్రదర్శించిన మారుతి..రెండేండ్ల తర్వాత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. సీఎన్జీ, ఎల్పీజీ వాహనాలకు ప్రత్యామ్నాయంగా సంస్థ ఈ మాడల్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. తద్వారా చమురు వాడకం తగ్గడంతోపాటు విలువైన విదేశీ మారకం చెల్లింపులు తగ్గే అవకాశం ఉండటం, కాలుష్యం మరింత తగ్గనున్నదన్నారు. ఈ కారును కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి ఆవిష్కరించారు.
ఇథనాల్ పంపుల కొరత
చమురు దిగుమతులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరోవైపు, ప్రత్యామ్నాయాలపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఈవీల వాడకాన్ని పెంపొందించడానికి తీసుకుంటున్న చర్యలు..వీటి కోసం చార్జింగ్ పాయింట్ల ఏర్పాటును పెద్దగా ప్రోత్సహించడం లేదు. దీంట్లోభాగంగా ప్రస్తుతం విడుదలైన ఇథనాల్ కారు ఇంధన సరఫరాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలుస్తున్నది. నూఢిల్లీ సర్కిల్లో ప్రస్తుతం 50 నుంచి 100 ప్రాంతాల్లో మాత్రమే ఇథనాల్ అవుట్లెట్లు మాత్రమే ఉన్నాయని, వీటిని పెంచాలనే డిమాండ్ నెలకొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

