మారుతి లాభంలో క్షీణత
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,659 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
- క్యూ4లో 6 శాతం తగ్గిన ప్రాఫిట్
- రూ.140 డివిడెండ్ ప్రకటించిన సంస్థ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,659 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,911 కోట్ల లాభంతో పోలిస్తే 6.45 శాతం తగ్గింది. గత త్రైమాసికంలో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు జరిపినప్పటికీ మార్కెట్ టూ మార్కెట్ ప్రభావంతో లాభాల్లో కోత పడిందని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 28.2 శాతం ఎగబాకి రూ.40,920 కోట్ల నుంచి రూ.52,462.5 కోట్లకు ఎగబాకినట్టు వెల్లడించింది.
మరోవైపు, గత త్రైమాసికంలో సంస్థ మరో చరిత్రను సృష్టించింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఒక త్రైమాసికంలో రూ.50 వేల కోట్ల విలువైన విక్రయాలు జరుపడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా సమావేశమైన కంపెనీ బోర్డు గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిషేరుకూ రూ.140 డివిడెండ్‌ను ప్రకటించింది. కిందటేడాది ప్రకటించిన రూ.135 కంటే ఇది అధికం.
- గత త్రైమాసికంలో సంస్థ నిర్వహణ ఖర్చులు రూ.37,585.5 కోట్ల నుంచి రూ.48,125.3 కోట్లకు పెరిగాయి.
- నాలుగో త్రైమాసికంలో సంస్థ 6,76,209 యూనిట్ల వాహన విక్రయాలు జరిపింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 11.8 శాతం పెరిగాయి.
- 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,83,316 కోట్ల ఆదాయంపై రూ.14,679.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
- గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 24,22,713 యూనిట్ల వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయంగా 19,74,939 యూనిట్లను విక్రయించగా..4,47,774 యూనిట్ల వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.14 వేల కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

