Maruti Suzuki Sales | గతేడాదితో పోలిస్తే గత నెలలో మారుతి సుజుకి కార్ల విక్రయాలు స్వల్పంగా 1.2 శాతం తగ్గుముఖం పట్టి, 1,24,280 యూనిట్ల నుంచి 1,22,685 యూనిట్లకు పడిపోయాయి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సెమీ కండక్టర్ల కొరతే కారణమని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ విడి భాగాల కొరత దేశీయంగా కార్ల తయారీపై ప్రభావం చూపింది. దీని ప్రభావాన్ని కనీస స్థాయికి తీసుకొచ్చేందుకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటున్నదని మారుతి సుజుకి వెల్లడించింది.
అయినప్పటికీ టయోటా కిర్లోస్కర్ మోడల్స్ బాలెనో, బ్రెజా, లైట్ కమర్షియల్ వెహికల్ సూపర్ క్యారీ విక్రయాలు కలుపుకుంటే గతేడాదితో పోలిస్తే గత నెలలో 1,32,024 యూనిట్ల నుంచి 1,30, 348 యూనిట్లకు పడిపోయింది. ఇదిలా ఉంటే ఆల్టో, ఎస్ప్రెస్సో కార్ల విక్రయాలు గత నెలలో 17 శాతం పడిపోయాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ కార్ల ఉత్పత్తి నుంచి ప్రైసర్ మోడల్ కార్ల ఉత్పత్తి వైపు మళ్లాలని నిర్ణయించుకున్నది.
బ్రెజా, ఎర్టిగా, ఎస్‌క్రాస్. ఎక్స్ఎల్6 కార్ల విక్రయాలు 2021తో పోలిస్తే గత నెలలో 28,172 నుంచి 18,860 యూనిట్లకు పడిపోయాయి. ఇప్పటికే యుటిలిటీ మార్కెట్‌పై కోల్పోయిన పట్టును తిరిగి పొందేందుకు మారుతి సుజుకి ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా గురువారం న్యూ-బ్రెజా కారును ఆవిష్కరించింది.