Maruti Suzuki IGNIS | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు ఇగ్నిస్ (IGNIS) ధర భారీగా పెంచేసింది. ఇగ్నిస్ వేరియంట్లు, మోడల్స్ వారీగా ధర రూ.27 వేల వరకు పెరుగుతుందని బీఎస్ఈ ఫైలింగ్‌లో శుక్రవారం తెలిపింది. తక్షణం పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లను ఇగ్నిస్ కారులో జోడించనున్నది. తమ కస్టమర్ల సేఫ్టీ కోసం ఈ ఫీచర్లు జత చేశామని బీఎస్ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. రియల్ డ్రైవింగ్ ఎమిసన్ (ఆర్డీఈ) నిబంధనలతోపాటు ఈ20 నిబంధనల అమలు నేపథ్యంలో ఈ ఫీచర్లు జత చేస్తున్నట్లు తెలిపింది. త్వరలో ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇగ్నిస్ మోడల్ కారు తొమ్మిది కలర్స్ వేరియంట్లలో లభ్యం అవుతుంది. దీని ధర రూ.5.55 లక్షలుగా నిర్ణయించారు. ఇగ్నిస్ ఇంజిన్ 1.2 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 6000 ఆర్పీఎం వద్ద 61 కిలోవాట్ల విద్యుత్, 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఏడు ట్రిమ్స్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 17.8 సీఎం ఇన్ఫోటైన్మెంట్, ఫోర్ స్పీకర్స్, డీఆర్ఎల్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తదితర ఫీచర్లు జత చేశాయి.