మారుతి కారు కొంటే షాక్.. 4 నెలల్లో 56వేలు పెంపు
మారుతి కారు కొంటే షాక్| దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ...

న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడల్ కార్ల ధరలు పెరుగుతాయని శుక్రవారం తెలిపింది. తక్షణం ధరల పెంపు అమలులోకి రానున్నది. పెంచిన ధరల ప్రకారం ఎంపిక చేసిన మోడల్ కార్ల ధరలు రూ.22,500 వరకు పెరుగుతాయి.
ముడి సరుకు, విడి భాగాల ధరలు పెరిగాయన్న సాకుతో గత జనవరిలోనే మారుతి సుజుకి సహా ఇతర ఆటోమొబైల్ సంస్థలు కార్లు, మోటారు బైక్‌లు, స్కూటర్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మారుతి సుజుకి అదే కారణం పేర్కొంది.

వివిధ ఇన్పుట్ వ్యయాలు పెరిగాయని మారుతి సుజుకి తెలిపింది. దీంతో ఎంపిక చేసిన కార్ల ధరలు పెరుగుతాయని వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలోని షోరూమ్ ధరల ప్రకారం సగటున కొత్తగా కార్లు కొనుగోలు చేసే వారిపై 1.6 శాతం భారం పడుతుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి వివరించింది.
సెలేరియో, స్విఫ్ట్ మోడల్స్ మినహా అన్ని మోడల్ కార్ల ధరలు పెరుగుతాయని స్పష్టం చేసింది. ఇన్‌ఫుట్ వ్యయాలు పెరిగినందున ఏప్రిల్ నుంచి తమ కార్ల ధరలు పెంచక తప్పదని గత నెలలోనే సంకేతాలిచ్చింది.

ఈ ఏడాదిలో మారుతి సుజుకి తన కార్ల ధరలు పెంచడం జనవరి నుంచి ఇది రెండోసారి. ఎంపిక చేసిన మోడల్ కార్లపై సగటున రూ.34 వేల చొప్పున పెరిగాయి.
స్టీల్ వంటి ముడి సరుకు, గ్లోబల్ కమోడిటీ ధరలు నిలకడగా పెరుగుతుండటంతో కార్ల తయారీదారులపై భారం పడుతున్నది. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్లో సెమీ కండక్టర్ల కొరత కూడా అధిక వ్యయానికి కారణం అవుతున్నది.
ఇవి కూడా చదవండి..
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
నీట్-2021వాయిదా
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్ఐ
రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్ కర్ఫ్యూ
ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..
ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్ సీఈఓ
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌కు కరోనా
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి
కరోనా సెకండ్ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి
దేశంలోకి త్వరలో కొత్తగా 8 బ్యాంకులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

