న్యూఢిల్లీ, ఆగస్టు 12: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్లో సీఎన్జీ వెర్షన్ను విడుదల చేసింది మారుతి సుజుకీ. కిలో సీఎన్జీకి 30.90 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ వాహనం సీఎన్జీ హ్యాచ్బ్యాక్లో అత్యధిక మైలేజీ ఇచ్చే వాహనం ఇదే కావడం విశేషం. 1.2 లీటర్ల కే-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ రెండు రకాల్లో లభించనున్నది.
దీంట్లో వీఎక్స్ఐ మోడల్ ధరను రూ.7.77 లక్షలుగాను, జెడ్ఎక్స్ఐ మోడల్ రూ.8.45 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఫ్యాక్టర్ ఫిట్టింగ్ సీఎన్జీ కిట్ ఉండటంతో భద్రత, పనితీరు, అత్యధిక మైలేజీ ఇవ్వనున్నదని పేర్కొంది. సంస్థ నుంచి విడుదల చేసిన తొమ్మిదో సీఎన్జీ మోడల్ ఇదని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.