న్యూఢిల్లీ, జూలై 24 : కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 88 వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్టీరింగ్ టై రాడ్‌లో సమస్యలు తలెత్తడంతో 87,599 యూనిట్ల ఎస్-ప్రెస్సో, ఈకో మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది. జూలై 5, 2021 నుంచి ఫిబ్రవరి 15, 2023 వరకు తయారైన కార్లలో ఉచితంగా విడిభాగాలను రీప్లేస్ చేయనున్నట్లు తెలిపింది.