Maruti Suzuki Grand Vitara | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ‘శిఖ’లో మరో మైలురాయి చేరింది. మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో శరవేగంగా దూసుకెళ్తున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) దేశీయ మార్కెట్లో రెండు లక్షల యూనిట్లు అమ్ముడైన కారుగా నిలిచింది. తొలి లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకోవడానికి ఏడాది గడువు పడితే, మరో లక్ష కార్ల అమ్మకానికి పది నెలల సమయం పట్టింది. హైబ్రీడ్, ఎస్-సీఎన్జీ వేరియంట్ కార్లకు భారీ డిమాండ్ నెలకొనడంతో కేవలం 22 నెలల్లోనే రెండు లక్షల కార్లు అమ్ముడైన మోడల్ గా మారుతి సుజుకి నిలిచింది. 2022 సెప్టెంబర్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారాను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ ఎస్యూవీ కారు ధర రూ.10.99 లక్షల నుంచి రూ.20.1 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది.
మిడ్ సైజ్ ఎస్ యూవీ కారు మారుతి సుజుకి గ్రాండ్ విటారా 9.0 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆర్కామ్యాస్ సౌండ్ సిస్టమ్, 7.0 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, హెచ్ యూడీ డిస్ ప్లే, వైర్ లెస్ చార్జింగ్, అంబియెంట్ లైటింగ్, 360-డిగ్రీ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే విత్ అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెన్స్, కనెక్టెడ్ కార్ టెక్, ఆటో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, పనోరమిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు కలిగి ఉంది.
రెండు ఇంజన్ల ఆప్షన్లతో మారుతి సుజుకి గ్రాండ్ విటారా మార్కెట్లో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ల కే15సీ పెట్రోల్ మైల్డ్ హైబ్రీడ్ పెట్రోల్ ఇంజిన్ విత్ 103 హెచ్పీ విద్యుత్ అండ్ 135 ఎన్ఎం టార్క్ తో వస్తున్నది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఏడబ్ల్యూడీ విత్ మల్టీపుల్ మోడ్స్ లో లభ్యం అవుతున్నది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ గల కారు లీటర్ పెట్రోల్ మీద 21.1 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఆటోమేటిక్ ఆప్షన్ 20.6 కి.మీ, మాన్యవుల్ ఏడబ్ల్యూడీ వేరియంట్ 19.4 కి.మీ మైలేజీ ఇస్తుంది.
టయోటా నుంచి తీసుకున్న 1.5 లీటర్ల త్రీ సిలిండర్ అత్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ 79 హెచ్పీ విద్యుత్, 141 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. హైబ్రీడ్ పవర్ ట్రైన్ ఇంజిన్ 115 హెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది. ఈ-సీవీటీ గేర్ బాక్స్ తో వస్తున్న హైబ్రీడ్ పవర్ ట్రైన్ ఇంజిన్ లీటర్ పెట్రోల్ మీద 27.97 కి.మీ మైలేజీ ఇస్తుంది.