న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: మారుతి సుజుకీ.. కాంప్యాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్రాంక్స్ పేరుతో విడుదల చేసిన ఈ కారు రూ.7.46 లక్షల నుంచి రూ.13.13 లక్షల మధ్యలో ధరను నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 1.2 లీటర్ పెట్రోల్, లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్‌తో ఈ మాడళ్లను రూపొందించింది. 1.2 లీటర్ ఇంజిన్‌లో మాన్యువల్, ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ కలిగిన మాడల్ రూ.7.46 లక్షల నుంచి రూ.9.27 లక్షల లోపు, లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్ మాడల్ రూ.9.72 లక్షల నుంచి రూ.13.13 లక్షల లోపు ధరను నిర్ణయించింది.
ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ మాడల్‌ను ఈ ఏడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ సందర్భంగా మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి టేకుచి మాట్లాడుతూ..కస్టమర్ల విభిన్న అవసరాలు, పరిశ్రమ పోకడలను అర్థం చేసుకొని ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. గతంలో విడుదల చేసిన బ్రెజ్జా.. నూతన కాంప్యాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో చరిత్ర సృష్టించిందన్నారు. ఈ కారు 20.01 కిలోమీటర్ల నుంచి 22.80 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది.