Maruti Fronx Delta plus (O) | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇటీవలే నెక్ట్స్ జనరేషన్ ‘స్విఫ్ట్’ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తాజాగా ఫ్రాంక్స్ (Fronx) కారులో న్యూ డెల్టా ప్లస్ (ఓ) (Delta Plus (O) వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఫ్రాంక్స్ న్యూ డెల్టా ప్లస్ (ఓ) వేరియంట్ 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ (ఎన్ఏ) పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది. ఈ కారు ధర రూ.8.93 లక్షల నుంచి రూ.9.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. డెల్లా +, జెటా వేరియంట్ల మధ్య న్యూ డెల్టా + (ఓ) నిలుస్తుంది. న్యూ డెల్టా + (ఓ) వేరియంట్ ఫ్రాంక్స్ కారులో సేఫ్టీ కోసం 6-ఎయిర్ బ్యాగ్స్ జత చేశారు. ఇంతకుముందు ఫ్రాంక్స్ జెటా, ఆల్ఫా వేరియంట్లలో మాత్రమే 6-ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్ ఉండేది. డెల్టా + వేరియంట్‌తో పోలిస్తే డెల్టా + (ఓ) వేరియంట్ కార్లు డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ జత చేయడంతో రూ.15 వేలు ఎక్కువ ధర పలుకుతాయి.
మారుతి సుజుకి న్యూ డెల్టా + (ఓ) వేరియంట్ కారులో 1.0 లీటర్ల బూస్టర్ జెట్ టర్బో చార్జిడ్ పెట్రోల్ మోటార్ ఆప్షన్ (గరిష్టంగా 100 బీహెచ్పీ విద్యుత్, 143 ఎన్ఎం టార్క్), 1.2 లీటర్ల ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ (గరిష్టంగా 90 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్) ఆప్షన్లు ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఆప్షనల్‌గా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కూడా ఉంది. తొలుత తీసుకొచ్చిన మారుతి ఫ్రాంక్స్ కారులో ఆపిల్ అండ్ ఆటో కార్ ప్లే, వైర్ లెస్ ఆండ్రాయిడ్ మద్దతుతో 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండో తదితర ఫీచర్లు యధాతథంగా ఉంటాయి.