న్యూడిల్లీ, మార్చి 8: పాత, కొత్త వాహనాలపై రుణాలు అందించడానికి హీరో ఫిన్‌కార్ప్‌తో మారుతి జట్టుకట్టింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంలో భాగంగా నూతన, పాత కార్లపై హీరో ఫిన్‌కార్ప్ రుణాలు అందించనున్నది. కార్ల కొనుగోలుదారులకు తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి.