న్యూఢిల్లీ, నవంబర్ 15: మారుతి సుజుకీ భారీ స్థాయిలో వాహనాలను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్లో సాంకేతిక లోపం కారణంగా 39,506 యూనిట్ల గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 9, 2024 నుంచి ఏప్రిల్ 29, 2025 మధ్యకాలంలో తయారైన ఈ వాహనాల్లో ఈ లోపాన్ని గుర్తించినట్టు పేర్కొంది.
ఈ బ్యాచ్లో ఉత్పత్తైన కొన్ని వాహనాల్లో స్పీడోమీటర్ అసెంబ్లీలో ఫ్యూయల్ లెవల్ వార్నింగ్ లైట్ సరిగా పనిచేయడం లేదని, దీన్ని సరిచేసే విషయంలో కార్ల యజమానులకు డీలర్ల సమాచారం ఇవ్వనున్నట్టు తెలిపింది. కారును తనిఖీ చేసి పాడైన విడిభాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేస్తారని వెల్లడించింది.