Maruti Baleno | మారుతి సుజుకి తన బాలెనో మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. వాక్యూమ్ పంప్లో లోపం కారణంగా 7,213 బాలెనో కార్లను రీకాల్ చేస్తున్నామని పేర్కొంది. 2016 అక్టోబర్ 27 – 2019 నవంబర్ 1 మధ్య కాలంలో తయారైన బాలెనో ఆర్ఎస్ వేరియంట్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. బ్రేక్ వేస్తున్నప్పుడు వ్యాక్యూమ్ పంప్ కీలకంగా వ్యవహరిస్తుంది.
వ్యాక్యూమ్ పంప్లో లోపం వల్ల అరుదుగా బ్రేక్ పెడల్పై అదనపు బలం ప్రయోగించాల్సి వస్తుందని గుర్తించినట్లు మారుతి సుజుకి పేర్కొంది. కనుక ఈ లోపం ఉన్న కార్లను గుర్తించి.. వ్యాక్యూమ్ పంప్ పరికరం రీప్లేస్ చేయాల్సి ఉంటుదని తెలిపింది. లోపం ఉన్న వ్యాక్యూమ్ పంప్ గల కార్ల యజమానులకు తమ డీలర్‌షిప్‌ల నుంచి సమాచారం పంపుతున్నామని వివరించింది. కస్టమర్లకు ఎటువంటి ఖర్చులేకుండానే వ్యాక్యూమ్ పంప్ రీప్లేస్ చేస్తామని పేర్కొంది. 2020 జనవరి నుంచి బాలెనో ఆర్ఎస్ మోడల్ కారు ఉత్పత్తిని నిలిపేసింది.
ఇంతకుముందు గత జనవరి 24న 11,177 గ్రాండ్ విటారా యూనిట్లు రీకాల్ చేసింది. గతేడాది ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి నవంబర్ 15 వరకు తయారైన గ్రాండ్ విటారా కార్లు రీకాల్ చేసింది. రేర్ సీటులో సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లో సాంకేతిక లోపం కారణంగా రీకాల్ చేస్తున్నామని వివరించింది. అంతకుముందు 18న ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఎకో, బ్రెజా, గ్రాండ్ విటారా, బాలెనో మోడల్ కార్ల ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్‌లో సాంకేతిక లోపం వల్ల 2022 డిసెంబర్ 8 నుంచి ఈ ఏడాది జనవరి 12 మధ్య నిర్మించిన వివిధ మోడల్ కార్లు 17,362 యూనిట్లు రీకాల్ చేసింది.
గతేడాది త్రీ మోడల్ కార్లు వ్యాగన్-ఆర్, సెలేరియో, ఇగ్నీస్ వంటి మూడు మోడల్ కార్లు రూ.9925 రీకాల్ చేసింది. రేర్ బ్రేక్ అసెంబ్లింగ్ పిన్ ఏర్పాటులో లోపం తలెత్తడమే దీనికి కారణం అని మారుతిసుజుకి వెల్లడించింది.