నేడు వేతనంతో కూడిన సెలవు
రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఓటర్లు తమ ఓటుహకును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ రోజును పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తూ కార్మికశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్మికశాఖ ప్రత్యేక ఉత్తర్వులు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఓటర్లు తమ ఓటుహకును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ రోజును పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తూ కార్మికశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తించనున్నట్టు తెలిపింది. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్(1974), తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ (1988) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేయాలని లేబర్ కమిషనర్, ఫ్యాక్టరీల డైరెక్టర్, కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

