న్యూఢిల్లీ, జూన్ 22: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో మాడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఫ్రాంక్స్ వెలోసిటీ ఎడిషన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.7.29 లక్షలు. 1.0 లీటర్ టర్బో, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించింది. 9 అంగుళాల టచ్‌స్క్రీన్ స్మార్ట్ ప్లే ప్రొ+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.