Maruti Baleno | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో తన బాలెనో కారు రీగల్ ఎడిషన్ ఆవిష్కరించింది. ఫెస్టివ్ సీజన్లో కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా బాలెనో రీగల్ ఎడిషన్ కారు తెచ్చింది మారుతి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల కార్ల కొనుగోలు దారులు కంపెనీ వెబ్ సైట్లో గానీ, డీలర్ల వద్ద గానీ ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ మోడల్ కారుపై కాంప్లిమెంటరీ యాక్సెసరీలు కూడా అందిస్తోంది మారుతి సుజుకి.
మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిసన్ కారు సిగ్నేచర్ స్టైల్ బ్లాక్డ్ ఔట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ లైట్ సెటప్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్, బాయ్ నెట్ మీద కంపెనీ క్రోమ్ ఫినిష్డ్ లోగో, ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్, బాడీ సైడ్ మౌల్డింగ్, డోర్ విజర్స్ తోపాటు గ్రిల్లెకు అప్పర్ గార్నిష్ చేశారు. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, 360 డిగ్రీ కెమెరా విత్ డైనమిక్ గైడ్ లైన్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కారు కనెక్ట్ టెక్నాలజీ, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్కు మద్దతుగా 9.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటాయి. సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఈఎస్పీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సహా 40 ఇతర స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి.