Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అన్నిరంగాల్లో అమ్మకాలు కనిపించాయి. ఉదయం మార్కెట్లు లాభాల్లో మొదలైనా.. చివరి సెషన్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు పతనమయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం.. 74,474.98 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత అదే ఉత్సాహం మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 74,741.25 గరిష్ఠానికి చేరుకుంది. అయితే, చివరి సెషన్లో లాభాల స్వీకరణకు దిగడంతో ఒక్కసారిగా మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 74,022.24పాయింట కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 217.41 పాయింట్లు తగ్గి.. 74,115.17 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92.20 పాయింట్లు తగ్గి.. 22,460.30 వద్ద ముగిసింది. మొదటి అర్ధభాగంలో నిఫ్టీ 22,650 పాయింట్ల మార్క్‌ను ధాటడంతో లాభాలను ఆర్జించింది.
కానీ, చివరి గంటలో లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో నిఫ్టీలో ప్రధాన నష్టాలను చవిచూశాయి. పవర్ గ్రిడ్ కార్ప్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్, నెస్లే ఇండియా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం తగ్గింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం పతనమైంది. ఎఫ్ఎంసీజీ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ ఒకటి నుంచి రెండుశాతం క్షీణించాయి. వేదాంత్ ఫ్యాషన్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆస్ట్రల్, షాపర్స్ స్టాప్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఈకేఐ ఎనర్జీ, శివ సిమెంట్, పీఎన్బీ గిల్ట్స్ తదితర 120కి పైగా స్టాక్‌లు బీఎస్ఈలో 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి.