Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ లో స్మార్ట్ రికవరీ సాధించాయి. తద్వారా సోమవారం నష్టాల నుంచి కొంత బయట పడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 694 పాయింట్ల లబ్ధితో 79,476.63 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ కనిష్ట స్థాయిల నుంచి సెన్సెక్స్ 1100 పాయింట్లు పుంజుకున్నది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 218 పాయింట్లు పుంజుకుని 24,200 మార్కును దాటేసి 24,213 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ-30లో సగానికంటే తక్కువ స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 1.39 శాతం, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోయాయి. మరోవైపు జేఎస్ డబ్ల్యూ స్టీల్ 1.62 శాతం, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్ పుంజుకున్నాయి.
అలాగే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ -50లో 31 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.79 శాతం, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్ లాభ పడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.62 శాతం, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. నిఫ్టీ-50లో మెటల్ ఇండెక్స్ 1.15 శాతం, ఆటో, ఫార్మా, ఐటీ, పీఎస్ యూ బ్యాంకు, హెల్త్ కేర్, కన్జూమర్ డ్యూరబుల్స్ లాభ పడ్డాయి. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాల్టీ, కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నష్టపోయాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్-100 ఇండెక్స్ 0.18 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్ 0.04 నష్టపోయాయి.