Stock Market | వారంలో తొలిరోజు దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ భారీగా నష్టపోయినా.. ఆ తర్వాత స్వల్పంగా మెరుగపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,214.42 నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,654.26 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యధికంగా 81,474.26 పాయింట్లకు పెరిగింది. చివరకు 77.26 పాయింట్ల నష్టంతో 81,373.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 34.10 పాయింట్లు పతనమై.. 24,716.60 వద్ద స్థిరపడింది.
Read Also : 2000 Notes | రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన..
ట్రేడింగ్‌లో దాదాపు 2,065 షేర్లు లాభపడగా.. 1,903 షేర్లు పతనమయ్యాయి.అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎటర్నల్, టాటా కన్స్యూమర్, పవర్ గ్రిడ్ కార్ప్ నిఫ్టీలో లాభాలను ఆర్జించాయి. హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జెఎస్డబ్ల్యు స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్ తదితర సంస్థలు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ ఒక్కొక్కటి 2 శాతం లాభపడ్డాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, మెటల్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Read Also : Aadhar Update | త్వరలో ముగియనున్న ఉచిత ఆధార్ అప్డేట్ గడువు.. అప్డేట్ చేసుకోండిలా