న్యూఢిల్లీ : మ్యాన్‌కైండ్ ఫార్మా ఐపీవో ఈ నెల 25న ప్రారంభమై..27న ముగియనున్నది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 24న షేర్లను విక్రయిస్తున్నది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు చెందిన 40,058,844 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నది. ఔషధాల ప్లాంట్‌ను మరింత విస్తరించడానికి ఈ నిధులను వినియోగించనున్నది.