ముంబై : ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 sale ) లాంఛ్‌తో న్యూ జనరేషన్ యాపిల్ ఫోన్లను సొంతం చేసుకునేందుకు యాపిల్ ఫ్యాన్స్ పోటీపడుతున్నారు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల కోసం యాపిల్ అభిమానులు ముంబై, ఢిల్లీలోని యాపిల్ స్టోర్ల ముందు బారులుతీరారు. ఐఫోన్ 15ను కొనుగోలు చేసేందుకు తాను ఏకంగా అహ్మదాబాద్ నుంచి ముంబై వచ్చానని ఓ టెక్ ఔత్సాహికుడు చెప్పుకొచ్చాడు.
ముంబైలోని యాపిల్ స్టోర్ ముందు క్యూలో 17 గంటల పాటు వేచిచూశానని తెలిపాడు. భారత్‌లోని తొలి యాపిల్ స్టోర్ నుంచి తొలి ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు తాను ఇక్కడకు వచ్చానని అన్నాడు. తాను వైట్ టైటానియం 256జీబీ వేరియంట్ ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్‌తో పాటు లేటెస్ట్ యాపిల్ వాచ్ అల్ట్రా 2. ఎయిర్‌పాడ్స్‌ను ప్రీ ఆర్డర్ చేశానని చెప్పాడు.
తనకు యాపిల్ బ్రాండ్ అంటే ప్రత్యేకమైన అభిమానం అంటూ తెలిపాడు. ఇక యాపిల్ బీకేసీ స్టోర్‌కు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిన వివేక్ అనే కస్టమర్ సైతం తాను ఐఫోన్ 15 ప్రొను కొనుగోలు చేసేందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నానని చెప్పాడు. ఏడాది పొడవునా లేటెస్ట్ ఐఫోన్ కోసం తాను వెయిట్ చేశానని వివరించాడు. ఇక ఢిల్లీలోనూ ఐఫోన్ 15 కోసం యాపిల్ స్టోర్ ఎదుట పెద్దసంఖ్యలో ప్రజలు బారులుతీరారు. కాగా, భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ రూ. 79,900 నుంచి అందుబాటులో ఉంది.
Read More :
Vijay Antony | కూతురు మరణంపై విజయ్ ఆంటోని ఎమోషనల్ పోస్ట్.. నేనూ చనిపోయానంటూ భావోద్వేగం..!