Vijay Antony | తమిళ నటుడు విజయ్ ఆంటోని కూతురు మృతి అందరినీ కలిచి వేసింది. 12వ తరగతి చదువుతున్న మీరా డిప్రెషన్ కారణంగా తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఆమె మృతి యావత్ సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. కన్న కూతురు కళ్ల ముందే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు విజయ్ ఆంటోనీ. కూతురు మృత దేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఎన్నో కార్యక్రమాల్లో ఆత్మహత్యకు వ్యతిరేకంగా ప్రచారకర్తగా పాల్గొన్న విజయ్ ఇంట్లోనే ఇలాంటి విషాదం చూడాల్సి రావడం అందరినీ కలచి వేతకు గురి చేస్తుంది.
కూతురు మరణించిన తర్వాత తొలిసారి విజయ్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. డియర్ హార్ట్స్.. నా కూతురు మీరా చాలా ప్రేమగా, ధైర్యంగా ఉండేది. ఇప్పుడు కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశానికి వెళుతుంది. ఆమె నాతో మాట్లాడుతుంది. తనతో పాటు నేనూ చనిపోయాను. ఆమెతో సమయం గడపడం ప్రారంభించాను. ఇక నుంచి నేను చేయబోయే మంచి పనులన్నీ తన పేరు మీదను చేస్తాను అంటూ ఓ ఎమోషన్ నోట్ రాసుకొచ్చాడు.
ఈ నోట్ చదివిన ప్రతీ ఒక్కరి గుండె బరువెక్కుతుంది. పలువురు సెలబ్రెటీలు ధైర్యంగా ఉండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీరా చనిపోయే ముందు ఓ లెటర్ రాసింది. అందులో లవ్ యూ ఆల్.. మిస్ యూ ఆల్ అని రాసిందని తెలిపారు. అంతకు మించి ఆ లెటర్లో ఏముందో వెల్లడించలేరు.
— vijayantony (@vijayantony) September 21, 2023