న్యూఢిల్లీ, మార్చి 21: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వాహన ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల నుంచి అన్ని రకాల వాహన ధరలను 3 శాతం వరకు సవరిస్తున్నట్లు తెలిపింది.
ఉత్పత్తి వ్యయం పెరగంతోపాటు కమోడిటీ ధరలు అధికం కావడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎస్యూవీ, కమర్షియల్ వాహనాలు మరింత ప్రియంకాబోతున్నాయి. ఇప్పటికే మారుతి, హ్యుందాయ్, టాటా, కియా, బీఎండబ్ల్యూ, హోండా సంస్థలు వాహన ధరలు పెంచిన విషయం తెలిసిందే.