Hindenburg | ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్పర్సన్ మాధబి పూరి బుచ్‌పై కొత్తగా వచ్చిన ఆరోపణలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సెక్యూరిటీస్ స్పందించింది. ఆరోపణలపై మాత్రం ఆమె స్పందించడం లేదని అమెరికా సంస్థ పేర్కొన్నది. స్టాక్ మార్కెట్లో జాబితా చేసిన అనేక కంపెనీలకు సేవలను అందించే కన్సల్టెన్సీ కంపెనీలో సెబీ చైర్పర్సన్ 99శాతం వాటా ఉందని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూఎస్‌కు షార్ట్‌సెల్లింగ్ సెల్లింగ్ కంపెనీ స్పందించింది. సెబీ చైర్పర్సన్ మాధబి బుచ్ యాజమాన్యంలో 99శాతం ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ సెబీలో పూర్తికాల సభ్యురాలిగా ఉన్న సమయంలో సెబీ నియంత్రణలో ఉన్న అనేక లిస్టెడ్ కంపెనీల నుంచి చెల్లింపులను అంగీకరించిందని తాజా ఆరోపణలు వచ్చినట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఉటంకిస్తూ.. ఈ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, పిడిలైట్ తదితర కంపెనీలున్నాయని, ప్రస్తుత ఆరోపణలు ఆమె భారతీయ కన్సల్టెంగ్ కంపెనీపైనే వచ్చిన విషయం తెలిసిందేనని.. ఇంకా సింగపుర్లోని సంస్థ వివరాలు వెలుగులోకి రాలేదని పేర్కొంది. వాస్తవానికి మాధబి పూరి బుచ్ ప్రమోట్ చేసే సంస్థ రూ.3కోట్ల ఆర్జించిందని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో మహీంద్రా కంపెనీ నుంచే అత్యధికంగా వచ్చిందని.. అప్పటికే ఆమె సెబీలో పూర్తిస్థాయి సభ్యురాలిగా ఉందని చెప్పింది. మహీంద్రా కంపెనీ నుంచి మాధబి భర్త దావల్ రూ.4.78 కోట్ల మేర ఆదాయం పొందారని.. బోర్డులో పర్మినెంట్ సభ్యురాలిగా ఉన్న సమయంలోనే ఆమె భర్త ఆదాయాన్ని పొందినట్లు కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ ఆరోపణలను మహీంద్రా ఖండించింది. ఆరోపణల్లో వాస్తవమని.. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. మాధబి భర్తతో కలిసి తాము ఎప్పటి నుంచో కలిసి పని చేస్తున్నట్లు వివరించింది.