Market Capitalisation | గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.86,847.88 కోట్లు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ -30 గతవారం 657.48 పాయింట్లు, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 225.9 పాయింట్ల లాభంతో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ లాభ పడ్డాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నష్టపోయాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,235.95 కోట్లు పుంజుకుని రూ.13,74,945.30 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.20,230.9 కోట్ల లాభంతో రూ.16,52,235.07 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.17,933.49 కోట్ల లబ్ధితో రూ.5,99,185.81 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.15,254.01 కోట్ల లాభంతో రూ.9,22,703.05 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.11,948.24 కోట్లు పెరిగి రూ.9,10,735.22 కోట్లకు చేరుకుంది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.1,245.29 కోట్లు పుంజుకుని రూ.5,49,863.10 కోట్లకు చేరుకుంది.
మరోవైపు, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,557.39 కోట్ల నష్టంతో రూ.7,13,567.99 కోట్లకు చేరుకుంది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,412.24 కోట్లు కోల్పోయి రూ.5,61,406.80 కోట్ల వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.2,283.75 కోట్ల పతనంతో రూ.7,95,803.15 కోట్ల వద్ద ముగిసింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.36.18 కోట్ల నష్టంతో రూ.15,08,000.79 కోట్ల వద్ద స్థిర పడింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐటీసీ, ఎల్ఐసీ, హిందూస్థాన్ యూనీ లివర్ నిలిచాయి.