న్యూఢిల్లీ, నవంబర్ 5: క్లౌడ్ సేవల పరిధిని మరింత విస్తరించడానికి దేశీయ మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) మరో సంస్థను చేజిక్కించుకోవడానికి సిద్ధమైంది. ఇదే క్రమంలో ఈ2ఈ నెట్వర్స్ లిమిటెడ్లో 21 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఒప్పందం విలువ రూ.1,40 7.02 కోట్లు. క్లౌడ్, కృత్రిమ మేధస్సు ఆధారిత సర్వీసుల పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కొనుగోలు జరిపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. టెక్నాలజీ రంగంలో కీలక వృ ద్ధిని నమోదు చేసుకుంటున్న ఈ రెండు విభాగాలు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఎల్అండ్టీ 15 శాతం వాటాను కొనుగోలు చేయడానికి రూ.1,079 కోట్ల నిధులు వెచ్చించనుండగా, మరో ఆరు శాతం వాటాను కొనుగోలుకు రూ.327.75 కోట్లు వెచ్చించనున్నది. ఈ ఒప్పందం వచ్చే నెల చివరినాటికి పూర్తికానున్నది.
ఆకాశ ఎయిర్ నష్టం 1,670 కోట్లు
న్యూఢిల్లీ, నవంబర్ 5: రెండేండ్ల క్రితం విమాన సేవలు ఆరంభించిన ఆకాశ ఎయిర్ భారీ నష్టాలను మూటగట్టుకున్నది. మార్చి 2024తో ముగిసిన ఏడాదికిగాను సంస్థకు రూ.1,670.06 కోట్ల నష్టం వచ్చినట్లు పేర్కొంది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.3,144.38 కోట్లకు ఎగబాకింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా రూ.744.53 కోట్ల నష్టం వచ్చింది. ప్రస్తుతం సంస్థ ప్రతిరోజు 24 విమానాలతో 110 రూట్లలో సేవలు అందిస్తున్నది. నిర్వహణ ఖర్చులు మూడింతలు పెరిగి రూ.4,814.44 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది.