LPG cylinder | వినియోగదారులకు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ (Commercial gas) ధరను తగ్గించాయి. 19 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .10 తగ్గిస్తున్నట్లు సోమవారం ఉదయం ప్రకటించాయి. తగ్గిన ధరలు ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై సహా దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,580గా ఉంది. గతంలో ఇది రూ.1,590గా ఉండేది. కోల్కతాలో రూ.1,694 నుంచి రూ.1,684కు తగ్గింది. ఇక ముంబైలో రూ.1,542గా ఉన్న ధర రూ.1,531.50కి దిగొచ్చింది. హైదరాబాద్లో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.1,746 నుంచి రూ.1,736కు తగ్గింది. మరోవైపు, గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పూలేదు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 మధ్య ఉంది.
Also Read..
Bank Holidays in December | డిసెంబర్లో 18 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల పూర్తి జాబితా ఇదే..!
రోల్డ్ గోల్డ్.. నయా ట్రెండ్.. మార్కెట్లో గిల్ట్ నగల సందడి