రోల్డ్ గోల్డ్.. నయా ట్రెండ్.. మార్కెట్లో గిల్ట్ నగల సందడి
రోల్డ్ గోల్డ్ జ్యుయెల్లరీకి కొనుగోలుదారుల నుంచి ఆదరణ బాగా కనిపిస్తున్నది. గతకొద్ది నెలలుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో అన్ని వర్గాలవారూ గిల్ట్ నగలను ధరించేస్తున్నారు. అక్టోబర్‌లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,34,800 పలికింది.
ప్రస్తుతం మార్కెట్లో రోల్డ్ గోల్డ్ జ్యుయెల్లరీదే హవా. బంగారు ఆభరణాల కంటే అంతా గిల్ట్ నగల కొనుగోళ్లపైనే అమితాసక్తిని కనబరుస్తున్నారు మరి. వ్యాపారులు, జ్యుయెల్లర్స్ సైతం కస్టమర్లకు నచ్చే రీతిలో రకరకాల మాడళ్లను అమ్మకానికి తెస్తుండటం కూడా ఈ ఇమిటేషన్ జ్యుయెల్లరీ ట్రెండ్‌కు దోహదం చేస్తున్నది.
రోల్డ్ గోల్డ్ జ్యుయెల్లరీకి కొనుగోలుదారుల నుంచి ఆదరణ బాగా కనిపిస్తున్నది. గతకొద్ది నెలలుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో అన్ని వర్గాలవారూ గిల్ట్ నగలను ధరించేస్తున్నారు. అక్టోబర్‌లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,34,800 పలికింది. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టినా.. ఇంచుమించుగా ఆ దరిదాపుల్లోనే కదలాడుతున్నది. దీంతో ఇంతింత పెట్టి కొనుక్కోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా అందరికీ ఇమిటేషన్ జ్యుయెల్లరీ ఇప్పుడు ఓ చక్కని ప్రత్యామ్నాయంగా మారిపోయింది.

ఇదీ సంగతి..
ఒకప్పుడు దిగువ మధ్యతరగతి వర్గాలే ఎక్కువగా ఈ గిల్ట్ నగలను వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఎగువ మధ్యతరగతి, ఇంకా చెప్పాలంటే సంపన్న వర్గాలవారూ ఎగబడిమరీ కొనేస్తున్నారు. పైగా గ్రాము బంగారం ధరలోనే 4-5 హెవీ రోల్డ్ గోల్డ్ జ్యుయెల్లరీ మాడళ్లు వచ్చేస్తున్నాయి. సాధారణంగా మార్కెట్లో నేడు ఒక్కో మాడల్ వెయ్యి రూపాయల నుంచి రూ.2-3వేల రూపాయలదాకా పలుకుతున్నాయి. డిజైన్‌నుబట్టి రూ.5-6వేల ధరలవీ ఉన్నాయి. వీటన్నిటికి 6 నెలల నుంచి ఏడాదిదాకా గ్యారంటీ కూడా ఉంటుండటం విశేషం. ఇక తయారీదారులు సైతం గోల్డ్ జ్యుయెల్లరీ కంటే కూడా ఈ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్లోనే ఎన్నో కొత్త డిజైన్లను తీసుకొస్తున్నారు. ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ నగల్ని.. నిశితంగా గమనిస్తే తప్ప అసలు బంగారం కాదనరంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. నిజానికి బంగారం నగలను తరచూ కొనే పరిస్థితి లేదు. ప్రస్తుత మార్కెట్లో ఎంతటి సంపన్నులైనా అందుకు ముందుకు రావట్లేదు. ఇప్పుడున్న ధరలే అందుకు కారణం. అంతేగాక బంగారం నగలకు భద్రత సైతం కరువైందనే చెప్పాలి. గిల్ట్ నగలకైతే ఈ సమస్య పెద్దగా ఉండదు.
వెండి నగలకు డిమాండ్
గోల్డ్ రేటు అమాంతం పెరిగిన నేపథ్యంలో కొందరు సిల్వర్ జ్యుయెల్లరీని ట్రెండ్‌గా భావిస్తున్నారు. మునుపు ఈ పరిస్థితి అంతగా లేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. అందుకే ఇలాంటివారి అభిరుచికి తగ్గట్టుగా ఎన్నో డిజైన్లు సైతం వెండి ఆభరణాల్లో లభిస్తున్నాయి. పైగా రకరకాల రంగు రాళ్లతో పొదగబడిన హెవీ జ్యుయెల్లరీని చూస్తే మతులు పోతాయంటే నమ్మశక్యం కాదుమరి. అలాగే సిల్వర్ ఇమిటేషన్ జ్యుయెల్లరీ కూడా అందుబాటులో ఉంటున్నది. వీటికీ గిరాకీ ఈమధ్య కాలంలో బాగానే పెరుగుతుండటం గమనార్హం. నిజానికి అక్టోబర్‌లో కిలో వెండి ధర ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.1,85,000గా నమోదైంది. ఇప్పుడు కాస్త తక్కువగా ఉన్నా.. గోల్డ్ కంటే ఎంతో నయమనే భావన మెజారిటీ కొనుగోలుదారుల్లో ఉన్నది. పైగా ఇటీవలికాలంలో వెండిపై పెట్టుబడులు పెట్టేవారూ పెరిగిపోయారు. అలాంటివారు ఈ సిల్వర్ జ్యుయెల్లరీ కొనుగోళ్లకూ ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. చిన్న మొత్తాల్లో కొనేవారు పెరిగిపోయారని వ్యాపారులు చెప్తున్నారు.
ఆన్లైన్లో..
సంప్రదాయ మార్కెట్లోనేగాక, ఆన్లైన్ మార్కెట్లోనూ ఇమిటేషన్ జ్యుయెల్లరీ ట్రెండీగా ఉంటున్నది. తక్కువ ధరలకే చక్కని మాడల్స్ అందుబాటులో ఉంటుండటం, అదనంగా ఆకర్షణీయ ఆఫర్లూ ఇస్తుండటం, బుక్ చేస్తే ఇంటికే వస్తుండటంతో చాలామంది తమ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకునిమరీ షాపింగ్ చేసేస్తున్నారు. మొత్తానికి జ్యుయెల్లరీ మార్కెట్‌ను రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ శాసించే స్థాయికి వచ్చేశాయనే చెప్పవచ్చు. బంగారం ధరలు ఇంకా పెరుగుతూపోతే బ్రాండెడ్ సంస్థలూ ఈ జ్యుయెల్లరీ అమ్మకాలకు ముందుకు వచ్చే వీలుందని ఇండస్ట్రీ మాట. ఇప్పటికే 1 గ్రామ్ గోల్డ్ జ్యుయెల్లరీని చాలా సంస్థలు మార్కెట్లో విక్రయిస్తున్నది చూస్తూనే ఉన్నాం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

