జీడీపీ జోష్‌తో ఉరకలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఊగిసలాటకు లోనైనా చివరకు లాభాలనే అందుకున్నాయి. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 474.75 పాయింట్లు పెరిగి 85,706.67 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం 134.80 పాయింట్లు అందుకుని 26,202.95 వద్ద ఆగింది.
- ఐఐపీ గణాంకాలు, ఆటో సేల్స్, జీఎస్టీ వసూళ్లు కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఊగిసలాటకు లోనైనా చివరకు లాభాలనే అందుకున్నాయి. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 474.75 పాయింట్లు పెరిగి 85,706.67 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం 134.80 పాయింట్లు అందుకుని 26,202.95 వద్ద ఆగింది. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్ ట్రేడింగ్‌ను ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ జీడీపీ గణాంకాలు ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, ఇతర అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమే. అలాగే డిసెంబర్ 1 (సోమవారం)న నవంబర్ నెలకుగాను విడుదలయ్యే వాహన విక్రయాల వివరాలు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లతోపాటు అక్టోబర్‌కుగాను వచ్చే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలూ మార్కెట్ సెంటిమెంట్‌ను శాసించే వీలున్నది.
ఇక ఈ వారం ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, ఆర్థిక రంగాల షేర్లు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కాగా, సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తే నిఫ్టీకి 25,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 25,700 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 26,400-26,600 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్కౌట్ అండ్ గైడ్ది నిస్వార్థ సేవ
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

