LCPL | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో మేడ్చల్ వద్ద వరల్డ్ క్లాస్ బిస్కెట్ తయారీ యూనిట్‌ను లోహియా గ్రూప్ ప్రారంభించింది. ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో ప్రస్తుతం నెలకు 1000 టన్నుల బిస్కెట్లు తయారుకానుండగా, వచ్చే నాలుగేండ్లలో ఈ సామర్థ్యాన్ని 5 వేల టన్నులకు పెంచుకోనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ కేంద్రం, ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రమాణాలకు అనుగుణమైన రీతిలో బెంచ్‌మార్క్ చేయబడింది. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొత్త హై-స్పీడ్ ఆటోమేటెడ్ సౌకర్యంతో నెలకు 1,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. మాడ్యులర్ సామర్థ్యాలతో నెలకు 5000 టన్నులకు విస్తరించేందుకు అనుమతిస్తుంది. వచ్చే నాలుగేండ్లలో ఈ సామర్థ్యాన్ని 5 వేల టన్నులకు పెంచుకోనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నాలుగేండ్లలో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా 6,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ సందర్భంగా లోహియా కన్ఫెక్షనరీ ప్రైవేట్ లిమిటెడ్ (LCPL) మేనేజింగ్ డైరెక్టర్ మనీషా లోహియా లహోటి మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన బిస్కెట్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు. క్రంచ్, క్రిస్పీనెస్గా ఉంటాయన్నారు. ఎంతో రుచిగా ఉంటాయని, అన్ని వయసుల వారు ఎంతో ఇష్టంగా తినే విధంగా తయారు చేస్తున్నామన్నారు.