న్యూఢిల్లీ, మే 27: హెల్మెట్లు, అంబులెన్స్‌లతోపాటు అత్యవసర వైద్య పరికరాలపై జీఎస్టీని తగ్గించడం లేదా పూర్తిగా ఎత్తివేయాలని ప్రధాని మోదీకి గ్లోబల్ రోడ్ సేఫ్టీ బాడీ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్(ఐఆర్ఎఫ్) సూచించింది. బుధవారం ప్రధానికి రాసిన లేఖలో ఐఆర్ఎఫ్ గౌరవ అధ్యక్షుడు కేకే కపిల ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం హెల్మెట్‌పై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారని, దేశీయ రోడ్లపై ప్రాణాలు కాపాడటంతో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అంబులెన్స్, అత్యవసర వైద్య పరికరాల్లో ఆక్సిజన్ సాంద్రీకరణ యంత్రాలు, మానిటర్లు, వీల్చైర్లు, ఇంప్లాంట్స్, ఇతర అత్యవసర హెల్త్‌కేర్ పరికరాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని ఆయన సూచించారు.