మా కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతున్నది. ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకైతే తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం లేవు.
– సిద్ధార్థ మోహంతీ, ఎల్ఐసీ సీఈవో-ఎండీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: బీమా దిగ్గజం ఎల్ఐసీ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.11,056 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.9,444 కోట్ల లాభంతో పోలిస్తే 17 శాతం వృద్ధిని కనబరిచింది. కానీ, నికర ప్రీమియం వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం రూ.1,17,017 కోట్ల నుంచి రూ.1,06,891 కోట్లకు తగ్గినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,01,994 కోట్లకు పరిమితమైంది.