న్యూఢిల్లీ, నవంబర్ 6 : దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,053 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటి ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.7,621 కోట్ల లాభంతో పోలిస్తే 32 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,29,620 కోట్ల నుంచి రూ.2,39,614 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
దీంట్లో నికర ప్రీమియం వసూళ్లు రూ.1,26,479 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో కంపెనీ నిర్వహణ ఖర్చులు రూ.2,23,366 కోట్ల నుంచి రూ.2,30,160 కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తిగత జీవిత బీమా ప్రీమియం వసూళ్లపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడంతో కంపెనీ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది.

రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ మార్పులపై ఆశాజనకంగా ఉన్నాము. ఈ మార్పులు కస్టమర్ల ప్రయోజనాలకు మేలు చేస్తాయని, దేశీయ జీవిత బీమా పరిశ్రమ వేగవంతంగా వృద్ధికి దారితీస్తాయని మా దృఢమైన నమ్మకం. జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలను వెంటనే కస్టమర్లకు బదలాయించడం జరిగింది.