న్యూఢిల్లీ, జూలై 4: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మరో రెండు పాలసీలను ప్రవేశపెట్టింది. నవ్ జీవన్ శ్రీ, నవ్ జీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం ప్లాన్లను శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ సత్పాల్ భానో మాట్లాడుతూ..
యువతను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు, ముఖ్యంగా యువతరం వారి కలలు, లక్ష్యాలు, బాధ్యతలను నెరవేర్చుకోవాలనుకునేవారి అవసరాలను తీర్చడానికి, భద్రతను అందించడానికి ఈ పాలసీల ముఖ్య ఉద్దేశమన్నారు. సింగిల్ ప్రీమియం, నాన్-లింక్డ్ ఇండివిజ్వర్ ప్లాన్లతో పొదుపుతోపాటు భద్రతను కూడా ఇవ్వనున్నది.