LIC Jeevan Umang | వ్యక్తులైనా.. ఏదైనా సంస్థ ఆర్థిక నష్టాల బారీన పడకుండా బీమా పాలసీ రక్షణ కల్పిస్తుంది. బీమా పాలసీ తీసుకున్న సంస్థకు, వ్యక్తికి పరిహారం హామీ లభిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయాలని మనోళ్లు భావిస్తే గుర్తుకు వచ్చేది భారతీయ జీవిత బీమా సంస్థే (ఎల్ఐసీ). దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా ప్రతి ఒక్కరికి ప్రజాదరణ పొందిన చాయిస్.
కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడిచే ఈ సంస్థలో విభిన్న వయస్సుల వారికి, నేపథ్య జీవితం ఉన్న వారికి బోల్డు ఆప్షన్లు ఉన్నాయి. అటువంటి ఆప్షన్లలో ఒకటి జీవన్ ఉమాంగ్. ఈ పాలసీ.. దీన్ని కొన్న పాలసీదారు కుటుంబానికి ఆదాయంతో కూడిన ప్రొటెక్షన్ లభిస్తుంది. పాలసీ మెచ్యూర్ అయ్యే వరకు కేవలం యాన్యువల్ సర్వైవల్ బెనిఫిట్లతోపాటు సదరు పాలసీ యజమాని జీవితం అంతా భారీ మొత్తంలో నగదు చెల్లిస్తుంది.
ఈ పాలసీ తీసుకున్న వారికి మెచ్యూరిటీ తర్వాత ఏటా రూ.36 వేల పెన్షన్ లభిస్తుంది. అయితే ప్రతి రోజూ రూ.45 డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు 26 ఏండ్ల వయస్సు గల యువకులు జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకున్నారనుకుందాం.. నెలవారీగా రూ.1350 (రోజుకు రూ.45) చెల్లించాలి. వార్షిక ప్రీమియం అయితే రూ.15,882 చెల్లించాలి. 30 ఏండ్లకు పాలసీ మెచ్యూర్ అయ్యాక తర్వాత మీకు ఎల్ఐసీ రూ.4,76,460 చెల్లిస్తుంది.
వరుసగా 30 ఏండ్ల ప్రీమియం చెల్లింపుల తర్వాత 31వ ఏడాది నుంచి ఎల్ఐసీ మీ ఖాతాలో రూ.36 వేలు జమ చేస్తూ ఉంటుంది. నూరేండ్ల వయస్సు వచ్చే వరకూ ప్రతియేటా రూ.36 వేల పెన్షన్ పొందొచ్చు. ఇలా వందేండ్ల వరకు జీవించి ఉంటే రూ.36 లక్షల మేరకు పొందొచ్చు.
పాలసీ దారు.. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. కనీసం రూ.2 లక్షల బీమా హామీ కల్పిస్తుంది.
ఒకవేళ 100 ఏండ్లలోపు పాలసీదారు దురదృష్టవశాత్తు మరణిస్తే.. నామినీగా పేర్కొన్న వారికి ఒకేసారి భారీ మొత్తంలో గానీ, వాయిదాల వారీగా చెల్లిస్తుంది ఎల్ఐసీ. ఈ పాలసీ 15 ఏండ్లు, 20 ఏండ్లు, 25 ఏండ్లు, 30 ఏండ్ల ప్రీమియం కలిగి ఉంటుంది.