Raja Mircha | ఈ మిర్చి ఘాటు తట్టుకోలేరు.. ఓడిపోతారు.. మంత్రి వీడియో వైరల్..!
Raja Mircha : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నాగాలండ్ మంత్రి తెమ్జీన్ ఇమ్నా అలాంగ్(Temjen Imna Along) ఈసారి తమ ప్రాంతంలో పండే మిర్చి గురించి హెచ్చరించాడు.
Raja Mircha : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నాగాలండ్ మంత్రి తెమ్జీన్ ఇమ్నా అలాంగ్(Temjen Imna Along) ఈసారి తమ ప్రాంతంలో పండే మిర్చి గురించి హెచ్చరించాడు. తమ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు.. ‘రాజ మిర్చ'(Raja Mircha)ను తక్కువ అంచనా వేయొద్దని ఆయన సూచించారు. పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి అయిన తెమ్జీన్ తాజాగా తన ఎక్స్ పోస్ట్‌లో మిరపకాయల వీడియో పోస్ట్ చేశాడు.
నాగాలాండ్‌లో జియోలాజికల్ ఐడెంటిఫికేషన్(GI) పొందిన మిర్చి రాజ మిర్చ. దీనికే ‘నాగా కింగ్ చిల్లి’ అని పేరు. నాలుగో అర్గానిక్ నాగా చిల్లి ఉత్సవం సందర్భంగా మంత్రి తెమ్జీన్ ఇమ్నా అలాంగ్ ఈ మిర్చి ఘాటుకు మీరు ఓడిపోతారు అని పోస్ట్ పెట్టారు. ‘నా అనుభవం కొద్ది రాజ మిర్చ గురించి మీకో విషయం చెప్పాలి. మీరు దీన్ని తినలేరు. ఈ మిర్చితో మీరు రాజీ పడతారు. ఎందుకంటే.. మీరు కచ్చితంగా ఓడిపోతారు అని రాసుకొచ్చిన మంత్రి.. నాగాలాండ్‌కు స్వాగతం, నీళ్లు, బియ్యంతో పాటు వినయంతో రండి’ అని పోస్ట్ పెట్టారాయన.
A word of advice about Raja Mircha from someone with experience. 🌶️
You do not eat it. You negotiate with it.
And you always lose.
Welcome to Nagaland. Bring water. Bring rice. Bring humility. 🏔️ pic.twitter.com/R8LMVLMKWD
— Temjen Imna Along (@AlongImna) September 1, 2026
పండు వాసనతో
రాజ మిర్చ చిల్లి అనేది నాగాలాండ్‌లో లభించే అన్ని రకాల మిర్చిలాంటిది కాదు. స్థానిక భాషలో దీనికి ‘నాగా మిర్చ’, ‘చుడీ చిల్లి’, ‘కింగ్ ఆఫ్ చిల్లిస్’ అని పేర్లున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చిగా గుర్తింపు సాధించిన రాజ మిర్చ.. పండు వాసన కలిగి ఉంటుంది. మొగ్గదశ అనంతరం ఆకుపచ్చ నుంచి ప్రకాశవంతమైన ఎరుపు రంగుకు మారుతుందీ మిర్చి.
మామూలుగా శంఖు ఆకారంలో ఉండే దీని పైపొర ముడతలుగా ఉంటుంది. నాగాలాండ్ ప్రజలు ఈరకం మిర్చిని తరతరాలుగా సాగు చేస్తున్నారు. అక్కడి చాలా తెగలు ఆదాయం, జీవనాధారం కోసం రాజా మిర్చపైనే ఆధారపడుతాయి. 2008లో దీనికి జీఐ ట్యాగ్ వచ్చింది. ఈ రాష్ట్రం నుంచి మొట్టమొదటి జీఐ ట్యాగ్ సాధించిన మిర్చి ఇదే కావడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

