LIC IPO | వచ్చే నెలలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవోకు వెళ్లనున్నది. ఇప్పటి వరకు పెన్షన్ ఫండ్స్, లైఫ్ & గ్రూప్ యాన్యుటీ ఫండ్స్‌లో ఎల్ఐసీ పెట్టుబడులు పెడుతూ వచ్చింది. ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టవుతున్నందు వల్ల ఇక నుంచి వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎల్ఐసీకి అవకాశం లేదు. ఇప్పటి వరకు పెన్షన్ , గ్రూప్ అండ్ లైఫ్ యాన్యుటీ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడుల ఉపసంహరణకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏఐ) వచ్చే ఏడాది (2023) జనవరి నెలాఖరు వరకు గడువు విధించింది.
వాటాదారుల పెట్టుబడులను వారికి బదిలీ చేయడానికి మరింత సమయం ఇచ్చేందుకూ నిరాకరించింది. అలా చేస్తే ఎల్ఐసీ వాటాదారులకు 2021 సెప్టెంబర్‌నాటికి 5365.83 కోట్ల నష్టం వాటిల్లుతుందని సెబీకి ఎల్ఐసీ సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టర్ (డీఆర్‌హెచ్‌పీ) తెలిపింది. అమోర్టెడ్ కాస్ట్ ( amortised cost ) వద్ద నిర్ధారించిన తర్వాత 90 రోజుల్లోపు వాటాదారుల ఇన్వెస్ట్మెంట్ వారికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా ఇన్వెస్ట్మెంట్లను `ఇతర ఇన్వెస్ట్మెంట్లు`గా క్లాసిఫై చేయాల్సి ఉంది.
ఇతర ఇన్వెస్ట్మెంట్లు ( other investment ) క్యాటగిరీలో మార్చని పెట్టుబడులను కొనసాగించేందుకు 2023 జనవరి నెలాఖరును గడువుగా నిర్ధారించింది. తదుపరి గడువు పొడిగించే ప్రసక్తే లేదని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది.
ఐపీవో కోసంసెబీకి ఎల్ఐసీ సమర్పించిన డీఆర్‌హెచ్‌పీలో గత సెప్టెంబర్ నాటికి ఇతర ఇన్వెస్ట్మెంట్ల రూపంలో రూ.11,289.36 కోట్లు (వీటిలో రూ.24.74 కోట్లు ఈక్విటీలు, రూ.11,264.62 కోట్లు డెట్ ఇన్స్ట్రుమెంట్లు) ఉన్నాయి. 90 రోజుల్లోపు పెన్షన్లు, గ్రూప్ అండ్ లైఫ్ యాన్యుటీ ఫండ్స్ ఖాతాదారులకు, వాటాదారులకు బదిలీ చేయకుంటే ఇతర ఇన్వెస్ట్మెంట్స్ అంటారు.