న్యూఢిల్లీ, జూన్ 21: దేశంలో అతిపెద్ద హౌజింగ్ ఫైనాన్స్ ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. నూతనంగా గృహ రుణాలు తీసుకునేవారికి వడ్డీరేటును అర శాతం కోత పెట్టింది. దీంతో 7.50 శాతం వార్షిక వడ్డీరేటుతో గృహ రుణాలు ప్రారంభంకానున్నాయి.
తగ్గించిన వడ్డీరేట్లు ఈ నెల 19 నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది. రిజర్వుబ్యాంక్ ఇటీవల కీలక వడ్డీరేట్లను అర శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో త్రిభువన్ అధికారి తెలిపారు.