వేతన జీవులకు 8.65 శాతం వార్షిక ప్రారంభ వడ్డీరేటుకే ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ రుణాలు ఇస్తున్నది. సిబిల్ స్కోర్ 800లకుపైగా ఉన్నవారికి మాత్రమే ఈ వడ్డీ వర్తిస్తుంది. 750-799 సిబిల్ స్కోర్ కలిగినవారికి 8.75 శాతం వడ్డీరేటు. 700-749 సిబిల్ స్కోర్ ఉన్నవారికి 9.05 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. 600-699 సిబిల్ స్కోర్ ఉంటే 9.3 శాతం వడ్డీని వసూలు చేస్తున్నది.