ముంబై, ఫిబ్రవరి 9: ఎల్ఐసీ ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. మూడో త్రైమాసికానికిగాను రూ.8,334.2 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.235 కోట్ల లాభంతో పోలిస్తే ఎన్నో రేట్లు పెరగగా..రెండో త్రైమాసికంలో నమోదైన రూ.15 వేల కోట్లతో పోలిస్తే సగానికి సగం తగ్గింది. గత త్రైమాసికంలో కంపెనీ నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,787.6 కోట్లుగా నమోదైంది.
గతేడాది ఇది రూ.97,620.34 కోట్లుగా ఉన్నది. పెట్టుబడులపై వచ్చిన ఆదాయం రూ.76,574 కోట్ల నుంచి రూ.84,889 కోట్లకు చేరుకున్నది.