LG Electronics IPO | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ ఎల్జీ అనుబంధ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా త్వరలో ఐపీఓకు రానున్నది. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’కి ముసాయిదా పత్రాలు సమర్పించింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఈ ఐపీఓ జరుగబోతున్నది. రూ.15,237 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓకు వెళుతోంది. ఈ ఐపీఓలో ఎల్జీ ప్రమోటర్ సంస్థ ‘ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐఎన్సీ 10.18 కోట్ల షేర్లు విక్రయిస్తుంది.
మోర్గాన్ స్టాన్లీ, యాక్సిస్ క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్, సిటీ గ్రూప్ బుక్, జేపీ మోర్గాన్ సంస్థలు ఐపీఓ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా ఐపీఓ ద్వారా రూ.27 వేల కోట్ల నిధులు సేకరించిన కొన్ని రోజులకే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓకు వెళ్లడం ఆసక్తికర పరిణామం. దేశంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా.. వాషింగ్ మిషన్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు విక్రయిస్తున్నది.