హైదరాబాద్, జూన్ 8: దేశీయ మార్కెట్లోకి సరికొత్త టీవీను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా. నూతన టెక్నాలజీ కోరుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని 64 అంగుళాల ఓఎల్ఈడీ సీ4 కృత్రిమ మేధస్సు టీవీను హైదరాబాద్లో విడుదల చేసింది. ఈ టీవీ ప్రారంభ ధర రూ.1,79,999గా నిర్ణయించింది.