న్యూఢిల్లీ, మార్చి 20: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా.. తన తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనమైన ‘ఈఎస్500ఈ’ని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 580 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు ధరను రూ.89.99 లక్షలుగా నిర్ణయించింది.
ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ సందర్భంగా లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ హికారు ఐకెచి మాట్లాడుతూ..దేశీయ కస్టమర్లు కోరుకుంటున్న విధంగా మరిన్ని మాడళ్లు ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు చెప్పారు.