Lava Yuva Star 4G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా తన లావా యువ స్టార్ 4జీ (Lava Yuva Star 4G) ఫోన్ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఏఐ ఫీచర్ల మద్దుతో 13-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందీ ఫోన్. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ గో ఎడిషన్ ఓఎస్ వర్షన్ పై పని చేసే ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. త్రీ కలర్ ఆప్షన్లు, సింగిల్ ర్యామ్ విత్ స్టోరేజీ కాన్ఫిగరేషన్ తో వస్తోంది.
లావా యువ స్టార్ 4జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,499లకు లభిస్తుంది. దేశంలోని సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. బ్లాక్, లావెండర్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుకోవచ్చు. 6.75 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే, ఫ్రంట్ కెమెరా టాప్ పై వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. యూనిసోక్ 9863ఏ ప్రాసెసర్ తో పని చేస్తుందీ ఫోన్. 4జీబీ ర్యామ్ ను వర్చువల్ గా మరో 4 జీబీ పెంచుకోవచ్చు.
లావా యువ స్టార్ 4జీ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు 13 మెగా పిక్సెల్స్ సెన్సర్ మెయిన్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో పలు ఏఐ బ్యాక్డ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 10 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటది.
iQoo Z9s 5G | బడ్జెట్ ధరకే ఐక్యూ జడ్9ఎస్ సిరీస్ ఫోన్లు.. 21న ఆవిష్కరణ..!
Tata Curvv EV | 7న టాటా కర్వ్.ఈవీతోపాటు చార్జ్ పాయింట్ అగ్రిగేటర్ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!