Lava Yuva 4 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. లావా యువ 4 (Lava Yuva 4) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, రెండు స్టోరేజీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. లావా యువ 4 (Lava Yuva 4) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ర్యామ్ స్టోరేజీ వేరియంట్ రూ.6,999, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,499లకు లభిస్తుంది. గ్లాసీ బ్లాక్, గ్లాసీ పర్పుల్, గ్లాసీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందీ ఫోన్. ఆఫ్‌లైన్ రిటైల్ షోరూమ్‌ల్లో లభిస్తుందీ ఫోన్.
లావా యువ 4 (Lava Yuva 4) పోన్ ఏడాది వారంటీ, ఫ్రీ హోం సర్వీసింగ్ ఇస్తుంది. ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.56 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్, యూనిసోక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్ తోపాటు ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 10వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.