Lava Blaze X | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన లావా బ్లేజ్ ఎక్స్ (Lava Blaze X) ఫోన్‌ను ఈ నెల 10న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 64- మెగా పిక్సెల్ సెన్సర్ ప్రైమరీ కెమెరా, త్రీ ర్యామ్ ఆప్షన్లతో వస్తున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్‌తో అందుబాటులో ఉంటుంది. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నాటికి సేల్స్ ప్రారంభం అవుతాయి.
లావా బ్లేజ్ ఎక్స్ 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ తోపాటు 128 జీబీ స్టోరేజీ లేదా 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. పర్పుల్, క్రీమ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ.15 వేల నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.
ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ లావా బ్లేజ్ ఎక్స్ 5జీ ఫోన్. సోనీ ఐఎంఎక్స్ 682 సెన్సర్ ప్రైమరీ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఈ నెల 10 మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఈ నెల 20, 21ల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ తో ఆన్ లైన్ విక్రయాలు ప్రారంభం అవుతాయి. రిటైల్ స్టోర్లలో వచ్చే నెల నుంచి విక్రయిస్తారు.
Mercedes-Benz EQA | 8న భారత్ మార్కెట్లోకి మెర్సిడెజ్ ఈవీ ఎస్యూవీ ఈక్యూఏ.. ఇవీ డిటైల్స్..!
Bajaj Qute CNG Taxi | త్వరలో బజాజ్ నుంచి క్యూట్ సీఎన్జీ ఆటో ట్యాక్సీ..!
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!