Car Loans | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్పేసియస్ గా ఉండే ఎస్ యూవీలు, ఎంపీవీలు, హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. అయితే, అత్యధికులు బ్యాంకు రుణాలు తీసుకుని కార్లు కొనుగోలు చేస్తున్నారు. సేఫ్టీ, సెక్యూరిటీతోపాటు రోజువారీ ప్రయాణానికి అనువుగా తమకు కంఫర్టబుల్ గా ఉండే కార్లు కొనుగోలు చేస్తున్నారు. కార్ల కొనుగోలుదారులకు బ్యాంకులు తక్కువ వడ్డీరేట్లకే రుణాలిస్తున్నాయి.
భారతీయ పౌరుడై ఉండి 18 ఏండ్ల పై వయస్సు గల వారు కారు లోన్ తీసుకోవచ్చు. నెలకు రూ.26 వేల ఆదాయం గల వేతన జీవి అయినా, స్వయం ఉపాధిపై జీవించే ప్రొఫెషనల్, వ్యాపారులు కార్ల రుణాలు తీసుకోవచ్చు. ఆధార్ బేస్డ్ ఈ-కేవైసీ లేదా వీడియో కేవైసీ పూర్తి చేయాలి. మంచి సిబిల్ స్కోర్ ఉన్న వారికి రుణ పరపతి లభిస్తుంది. కారు కొనుగోలుకు అవసరమైన పత్రాలు పూరించి డౌన్ పేమెంట్ చేస్తే.. మీ అర్హతను బట్టి రుణం మంజూరు అవుతుంది. బ్యాంకులు గరిష్టంగా ఐదేండ్ల గడువుతో రూ.5 లక్షల వరకూ రుణాలిస్తాయి. తదనుగుణంగా రుణం చెల్లింపునకు నెలవారీ ఈఎంఐ ఖరారు చేస్తాయి.
ఇంటి రుణ గ్రహీతలకు, కార్పొరేట్ వేతన జీవులకు 0.25 శాతం వడ్డీ రేటు రాయితీ లభిస్తుంది. 800లకు పైగా సిబిల్ స్కోర్ గల వారికి 0.50 శాతం వడ్డీ రాయితీ. 750-799 మధ్య సిబిల్ స్కోర్ ఉన్న వారికి 0.25 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. పీఎస్బీ అప్నా వాహన్ సుగం గల వారికి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం వరకూ చార్జీ రాయితీ. ఈ నెల 14న వివిధ బ్యాంకుల నుంచి లభించిన సమాచారం మేరకు కార్ల రుణాలపై వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ వివరాలు తెలుసుకుందామా..!
బ్యాంకు పేరు – వడ్డీరేటు – ఈఎంఐ (రూ.ల్లో) – ప్రాసెసింగ్ ఫీజు (రూ.ల్లో)
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.70 / 10.45 – 10,307 /10,735 – 1,000
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 8.75 – 10.60 – 10,319 / 10,772- 0.25% (1,000 – 1,500)
బ్యాంకు ఆఫ్ బరోడా – 8.90 / 12.70 10,355 / 11,300 – 2,000
కెనరా బ్యాంక్ – 8.70 /12.70 10,307 – 11,300 – 0.25% (గరిష్టంగా రూ. 2,500)
యూకో బ్యాంక్ – 8.45 / 10.55 10,246 / 10,759 – 0
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.95/ 10.00 10,367-10,624 – రూ. 1,500 వరకూ
ఐడీఐబీఐ బ్యాంక్ – 8.80/ 9.65 10,331 – 10,294 – 2,500
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 8.70 / 13.00 10,307 / 11,377 – 0.25% (రూ.. 1,000 – రూ. 15,000)
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – 8.85 / 12.00 10,343 / 11,122 – 0.50% (రూ. 500 – రూ. 5,000)
ఐసీఐసీఐ బ్యాంక్ – 9.10 శాతం నుంచి 10,403 నుంచి 2% వరకూ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ – 9.20 శాతం నుంచిonwards 10,428 onwards 0.50% (Rs 3,500 – Rs 8,000)
కర్ణాటక బ్యాంక్ – 8.88 / 11.37 – 10,350 / 10,964 – 0.60% (రూ 3,000 – రూ 11,000)
ఫెడరల్ బ్యాంక్ – 8.85 శాతం నుంచి- 10,343 నుంచి – రూ. 2,000 – రూ 4,500
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ – 8.85 / 10.25 – 10,343 / 10,685 – 0.25% (రూ.1,000 – రూ. 15,000)
సౌత్ ఇండియన్ బ్యాంక్ – 8.75 శాతం నుంచి- 10,319 నుంచి మొదలు- 0.75% (గరిష్టంగా రూ. 10,000)
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ – 9.00 శాతం నుంచి – 10,379 నుంచి మొదలు – రూ. 10,000
సిటీ యూనియన్ బ్యాంక్ – 14.45/ 14.95 – 11,751 /11,882 – 1.25% (కనిష్టంగా రూ. 1,000)