Semiconductor Project : అసోంలోని మోరిగావ్ జిల్లా జగిరోద్లో టాటా గ్రూప్ ఏర్పాటు చేసే సెమికండక్టర్ ప్రాజెక్ట్‌కు భూ ఒప్పందం మంగళవారం ఖరారైంది. ఈరోజు అసోంతో పాటు దేశానికి చారిత్రక దినమని మోరిగావ్ డిప్యూటి కమిషనర్ దేవాన్ష్ శర్మ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక సెమికండక్టర్ ప్లాంట్‌కు భూమిని అప్పగించే ప్రక్రియ ఈరోజు ముగిసిందని చెప్పారు.
రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ హామీ ఇచ్చిన మేరకు క్షేత్రస్ధాయిలో పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. టాటా గ్రూప్ పేరిట మొత్తం దాదాపు 500 ఎకరాలను రిజిస్టర్ చేశామని చెప్పారు. టాటా గ్రూప్ ప్రతినిధి బృందం ఇక్కడే ఉండి అన్ని లాంఛనాలు పూర్తి చేసిందని తెలిపారు. తమకు కేటాయించిన భూమిలో త్వరలో నిర్మాణ పనులను చేపడతామని టాటా గ్రూప్ బృందం తెలిపిందని దేవాన్ష్ శర్మ వెల్లడించారు.
టాటా గ్రూప్ ఏర్పాటు చేసే సెమికండక్టర్ ప్లాంట్ ద్వారా స్ధానికులతో పాటు రాష్ట్ర యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పలు అనుబంధ పరిశ్రమలూ రాష్ట్రానికి తరలివస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్లాంట్‌తో అసోం ఆర్ధిక వ్యవస్ధకు ఊతం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read More :