ముంబై: లలితా జ్యువెల్లరీ షేరు అదరగొట్టంది. లిస్టింగ్ రోజే ఇష్యూ ధర కంటే 24 శాతం అధికంగా ముగిసింది. ఇష్యూ ధర రూ.201 కాగా, ఉదయం రూ.265.30 వద్ద ప్రారంభమైన షేరు ధర..ఇంట్రాడేలో 36.46 శాతం ఎగబాకింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 23.58 శాతం లాభంతో రూ.248. 40 వద్ద ముగిసింది.
అటు ఎన్ఎస్ఈలోనూ షేరు 23.60 శాతం అందుకొని రూ.248. 44 వద్ద స్థిరపడింది. దీంతో తొలిరోజే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.13, 903.19 కోట్లుగా నమోదైంది. ఇటీవల ఐపీవోకి వచ్చిన లలితా జ్యువెల్లరీ రిటైల్ మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది.