న్యూఢిల్లీ: ఇండియా కూటమికి చెందిన విపక్ష ఎంపీలు ఢిల్లీలో ఇవాళ ర్యాలీ చేపట్టనున్నారు. కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar) రాజీనామా డిమాండ్ చేస్తూ ఆ ర్యాలీ నిర్వహించనున్నారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సమయంలో అక్రమాలు జరిగినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ రీతిలో ఓటర్లను తొలగించినట్లు విపక్షాలు పేర్కొన్నాయి.
#WATCH | Delhi | LoP, Lok Sabha, Rahul Gandhi, along with INDIA bloc MPs, marches to the Election Commission of India https://t.co/OwLWdXvhoo
— ANI (@ANI) October 6, 2026
అయితే ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 3 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాందీ, అభిషేక్ బెనర్జీ , అఖిలేశ్ యాదవ్ ఆ మార్చ్‌లో పాల్గొననున్నారు. పార్లమెంట్ మకర ద్వారం వద్దకు ఎంపీలు చేరుకున్నారు. నిర్వాచన్ సదన్ వరకు మార్చ్ నిర్వహించనున్నారు. సర్ ప్రక్రియ సమయంలో ఫోరమ్-6 దరఖాస్తులో మార్పులు చేసి ఈసీ అక్రమాలకు పాల్పడినట్లు విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు.
#WATCH | Delhi | INDIA bloc MPs, who are set to march to the Election Commission of India, sloganeer against CEC Gyanesh Kumar https://t.co/eCh14PwqFz
— ANI (@ANI) October 6, 2026